‘రాణి’ని దత్తత తీసుకున్న మెగా కోడలు.

అపోలో ఫౌండేషన్ వైస్‌ చైర్‌పర్సన్‌, రామ్‌ చరణ్ భార్య ఉపాసన సోమవారం 31వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒక ఏనుగును దత్తత తీసుకున్నారు ఈ మెగా కోడలు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో రాణి అనే ఏనుగును సంవత్సరం పాటు దత్తత తీసుకున్న ఉపాసన.. దాని సంరక్షణ కోసం రూ.5లక్షల చెక్‌ను క్యూరేటర్‌ క్షితిజకు అందజేశాడు.

ఈ సందర్భంగా క్షితిజ, ఉపాసనకు థ్యాంక్స్‌ చెప్పారు. మూగ జీవాలపై ఉపాసనకు ఉన్న నిబద్ధత చాలా మందిని ఇన్‌స్పైర్‌ చేస్తుందని క్షితిజ అన్నారు. ఉపాసనను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మరికొంతమంది జంతువులను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు

కాగా నెహ్రూ జూపార్క్‌లో ఉన్న వృద్ధ జంతువుల్లో రాణి ఒకటి. గత ఏడాది అక్టోబర్‌లో 81 సంవత్సరాలను పూర్తి చేసుకుంది రాణి. రికార్డుల ప్రకారం 1963లో రాణిని నిజాంలు జూ పార్క్‌కు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా జంతువుల దత్తత కార్యక్రమం ద్వారా నెహ్రూ జూ పార్క్‌కు గతేడాది ఫిబ్రవరి వరకు రూ.30లక్షల రెవెన్యూ సమకూరినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here