ఐపిఎల్ పై రాహుల్ ద్ర‌విడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

రానున్న రోజుల్లో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని టీం ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ద్రవిడ్  అన్నారు. ఇప్ప‌టికైతే అంతా జాగ్ర‌త్త‌గా ఉన్నార‌ని అక్టోబ‌రులో ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌న్నారు.

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ క్రీడాకారుల‌పై అంత ప్ర‌భావ‌మేమీ చూప‌లేదు. ఎందుకంటే లాక్‌డౌన్ ముందుగానే విధించ‌డంతో క్రీడాకారులెవ్వ‌రూ బ‌య‌ట‌కు రాలేదు. అయితే ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో ఎన్నో టోర్నీలు కూడా వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు ఇదే విష‌యంపై రాహుల్ ద్ర‌విడ్ స్పందించారు.

అక్టోబ‌ర్ నెల‌లో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. వైర‌స్ తీవ్ర‌త దృష్ట్యా టోర్నీలు ర‌ద్ద‌య్యాయి కానీ మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికైతే ఆట‌గాళ్లంద‌రూ సురక్షితంగా ఉన్నార‌ని.. అక్టోబ‌ర్‌లో క్రికెట్ మొద‌లైతే ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌న్నారు ద్ర‌విడ్‌. కాగా ఐపిఎల్‌కు సంబంధించి ఇప్ప‌ట‌కే షెడ్యూల్ విడుద‌లైంది. సెప్టెంబ‌ర్ 19న ఐపిఎల్ ప్రారంభంకానుండ‌టం తెలిసిందే. క్రికెట్‌లో క్రీడాకారుల‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప‌లువురు చెబుతూనే ఉన్నారు. కాగా బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

బీసీసీఐ గుట్టు విప్పిన యువ‌రాజ్‌సింగ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here