బిగ్‌బాస్ 4 కోసం రెడీ అవుతున్న నాగార్జున‌

బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చేశానంటూ హీరో నాగార్జున చేసిన కామెంట్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతోంది. ఇన్నాళ్లూ సినిమాలు, రియాలిటీ షోలు లేక విల‌విల‌లాడిపోయిన ప్రేక్ష‌కులు ఇప్పుడు నాగ్ కొత్త గెట‌ప్‌తో షోల‌కు రెడీ అవుతున్నారు.

బుల్లితెర అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ 4 వ‌చ్చేస్తోంది. ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌న్నారు. దీంతో షూటింగ్ కు వ‌చ్చిన నాగార్జున చాలా రోజుల త‌ర్వాత షూటింగ్‌కు వ‌చ్చాన‌ని కామెంట్ చేశారు. లైట్స్‌, కెమెరా, యాక్ష‌న్ నిజంగా అద్భుత‌మ‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

బిగ్‌బాస్ సీజన్ 4 కి సంబంధించిన ప్ర‌చార చిత్రాల షూటింగ్ ప్రారంభమైంది. పీపీఈ కిట్లు ధ‌రించిన మేక‌ప్ మెన్లు నాగార్జున‌ను షూటింగ్‌కు రెడీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే బిగ్‌బాస్ 4లో పాల్గొనే కంటెస్టెంట్ల‌ను ఫైన‌ల్ చేసే ప‌నిలో యూనిట్ ఉంది. క‌రోనా నేప‌థ్యంలో షోను ప‌క‌డ్బంధీగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కంటెస్టెంట్ల‌ను ఎంపిక చేసిన త‌ర్వాత క‌రోనా టెస్టులు చేసి క్వారంటైన్‌కి త‌ర‌లిస్తారు. వారి ఆరోగ్య ప‌రిస్థితులు ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేస్తారు. అనంత‌రం బిగ్‌బాస్ హౌస్‌లోకి అనుమ‌తిస్తారు.

బిగ్ బాస్4పై శ్రద్ధాదాస్ కామెంట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here