విశాఖ ప్ర‌మాదంలో 11 మంది మృతి.. సీఎం జ‌గ‌న్ ఆరా

విశాఖ‌ప‌ట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో జ‌రిగిన ప్ర‌మాదంపై సీఎం జ‌గ‌న్ దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్రమాదం జ‌రిగిన వెంట‌నే జిల్లా అధికారుల‌తో మాట్లాడి అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కాగా క్రేన్ కుప్ప కూలిపోవ‌డంతో 11 మంది మృత్యువాత ప‌డ్డారు.

హిందుస్థాన్ షిప్ యార్డులో క్రేన్ ద్వారా లోడింగ్ ప‌నులు ప‌రిశీలిస్తుండ‌గా క్రేక్ కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో 11 మంది చ‌నిపోయారు. మృతుల్లో న‌లుగురు హెచ్ఎస్ఎల్ ఉద్యోగులు కాగా మిగ‌తా వారు కాంటాక్ట్ ఏజెన్సీల‌కు చెందిన వారు. మృతుల్లో 10 మంది ఆచూకీని ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించారు.

ప్ర‌మాదంపై సీఎం జ‌గ‌న్ అధికారుల‌తో మాట్లాడారు. అధికారుల‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకొని త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలుసుకోవాల‌న్నారు. కాగా క్రేన్ ఆప‌రేష‌న్‌, మేనేజ్‌మెంట్లో మొత్తం మూడు కాంట్రాక్ట్‌ సంస్థ‌లు ఉన్న‌ట్లు విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ విన‌య్ చంద్ తెలిపారు. ప్ర‌మాదంపై రెండు క‌మిటీలు వేస్తున్న‌ట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here