గ‌న్ లైసెన్స్‌ కావాలంటే మొక్క‌లు నాటాల్సిందే

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు ప్ర‌భుత్వాలు ఏం చేయాలో అన్నీ చేస్తున్నాయి. తాజాగా గ‌న్ లైసెన్స్ కావాలంటే మొక్క‌లు నాటాల్సిందే అంటున్నారు కొంద‌రు. ఇది ఎక్క‌డ‌నుకుంటున్నారా పంజాబ్‌లో.

పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లాలో గ‌న్ లైసెన్స్ కావాలంటే క‌చ్చితంగా 10 మొక్క‌లు నాటాల‌ని అధికారులు నిబంధ‌న‌లు పెట్టారు. డివిజ‌న‌ల్ క‌మీష‌నర్ చంద‌ర్ గైండ్ ఈ మేర‌కు రూల్స్ ప్ర‌క‌టించారు. పాటియాలాలో ప‌ర్యావ‌ర‌ణం పెంచేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న అంటున్నారు. ఈ విధానానికి ట్రీస్ ఫ‌ర్ గ‌న్ అని పేరు కూడా పెట్టేశారు.

గ‌న్ లైసెన్స్ కావాల‌నుకుంటే ప‌ది మొక్క‌లు నాటి ఫోటో దిగి పంపాల‌న్నారు. ఫోటోలు వచ్చిన తర్వాత‌నే గ‌న్ లైసెన్స్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. ట్రీస్ ఫ‌ర్ గ‌న్స్ ద్వారా ప‌చ్చ‌ద‌నం పెంచ‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశంగా వీరు ముందుకు వెళుతున్నారు. అయితే నాటే మొక్కుల్లో ప‌త్తి మొక్క‌లు ఉండ‌కూడ‌ద‌న్నారు. అయితే మొక్క‌లు నాటి వ‌దిలేయ‌కుండా వాటిని ఒక నెల పాటు పెంచాలి. ఈ ఫోటోలు పంపిస్తేనే గ‌న్ లైసెన్స్ ఇస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here