ఏపీ ప్ర‌భుత్వం భేష్‌.. జాతీయ స్థాయిలో గుర్తింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  అయిన‌ప్ప‌టికీ టెస్టులు చేయ‌డంలో ఏపీ ముందు వ‌రుస‌లో ఉంటూ అంద‌రి నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

ఏపీలో కేసులు ఢిల్లీని దాటేశాయి. 1 ల‌క్షా 40 వేల పాజిటివ్ కేసుల‌తో ఏపీ దేశంలోనే మూడో స్థానంలోకి వ‌చ్చింది. ఇందులో తూర్పు గోదావ‌రి, క‌ర్నూలు, అనంత‌పురం, గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి, చిత్తూరు విశాఖ‌ప‌ట్నంలో కేసులు ఎక్కువ‌గా ఉన్నాయి. కేవ‌లం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే విశాఖ‌లో భారీగా కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం విశాఖ‌లో ప‌దివేల‌కు పైగా కేసులు ఉన్నాయి.

మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. గ్రామాల్లో క‌రోనాపై అవ‌గాహ‌ణ క‌ల్పించేందుకు అదికారులు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. దీంతో ఏపీ మ‌రో రికార్డును కూడా సాధించింద‌ని చెప్పొచ్చు. అదేందంటే ఎక్కువ‌గా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల‌లో ఏపీ కూడా ఉంది. టెస్టులు ఎక్కువ చేస్తూనే వైర‌స్‌ను గుర్తించే ప‌నిలో ప్ర‌భుత్వం ఉంది. ఈ మేర‌కు ఏపీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ మెచ్చుకున్నారు. ఏపీలో క‌రోనా లెక్క‌లు దాచ‌డం లేద‌న్నారు.

క‌రోనాపై భ‌య‌మొద్దు.. సీఎం వై.ఎస్ జ‌గ‌న్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here