గుంజ‌న్ స‌క్సేనా చిత్రంలో జాన్వీ క‌పూర్ ఏం చేసింది.

ఇండియ‌న్ తొలి మ‌హిళా పైలెట్ గుంజ‌న్ స‌క్సేనా జీవిత క‌థ ఆదారంగా జాన్వీ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టించిన సినిమా ఇండియాలో హాట్ టాపిక్‌గా మారింది. స‌క్సేనా ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారో కళ్ల‌కక‌ట్టినట్లు క‌నిపిస్తుండటంతో ఇప్ప‌డు ఈ మూవీపై అంతా భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

గుంజ‌న్ స‌క్సేనా.. ది కార్గిల్ గ‌ర్ల్ అనే సినిమాను శ‌ర‌ణ్ శ‌ర్మ జాన్వీక‌పూర్‌ను ప్ర‌ధాన పాత్ర‌లో పెట్టి తీస్తున్న విష‌యం తెలిసిందే. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే ఏప్రిల్ లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది. అయితే క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డింది. ఇప్పుడు మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సినిమాను ఈ నెల 12న ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

గుంజ‌న్ స‌క్సేనా చిన్న‌ప్ప‌టి నుంచి ఎలా ఉండేది. పైలెట్ కావ‌డానికి ఆమె ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశార‌న్న‌ది ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. పైలెట్‌గా శిక్ష‌ణ తీసుకుంటున్న స‌మ‌యంలో ఎదురైన అనుభ‌వాలు, అవ‌మానాలు చిత్రంలో మ‌న‌కు క‌నిపిస్తాయి. ఇవ‌న్నీ దాటుకొని తొలి పైలెట్‌గా సక్సేనా ఎలా ముందుకు వెళ్లార‌న్న‌ది భావోద్వేగంతో తెర‌కెక్కించారు. సినిమాలో జాన్వీ క‌పూర్ త‌న‌దైన శైలిలో న‌టించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి తొలి మ‌హిళా పైలెట్ సినిమా ఎలా ఉండ‌బోతోందో తెలియాలంటే 12వ తేదీ వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే.

ప్రొడ్యూసర్లుకి షాక్ ఇచ్చేలా బుట్టబొమ్మ రెమ్యూనరేషన్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here