ఏపీలో ఏమైనా జ‌రిగితే చంద్ర‌బాబుదే బాద్య‌త‌.. మంత్రి క‌న్న‌బాబు

ఏపీ వ్య‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్నబాబు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడుపై మండిప‌డ్డారు. రాష్ట్రంలో అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగితే చంద్ర‌బాబే బాధ్య‌త వ‌హించాల‌న్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దే త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌న్నారు.

క‌మిటీల నివేదిక‌ల ఆదారంగానే తాము మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. ఇక రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టార‌ని.. ఇది స‌రైంది కాద‌న్నారు. త‌క్ష‌ణ‌మే ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌న్నారు. హైద‌రాబాద్‌లో ఉంటూ బాబు రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డంలో చంద్ర‌బాబు మేధావి అన్నారు.

టిడిపి హ‌యాంలో రాజ‌ధాని కట్ట‌కుండా 2015 నుంచి 2019 వ‌ర‌కు చంద్ర‌బాబు అమ‌రావ‌తిని ఎందుకు అభివృద్ధి చేయ‌లేద‌న్నారు. తాను అధికారంలో ఉన్నంత కాలం ప్ర‌జ‌లను చంద్ర‌బాబు మ‌భ్య‌పెట్టార‌న్నారు. చంద్ర‌బాబు పోరాటం సొంత ప్రయోజ‌నాల కోస‌మే త‌ప్ప ప్ర‌జ‌ల కోసం కాద‌ని క‌న్న‌బాబు అన్నారు.

మొత్తం మీరే చేశారు.. బాబు..ఇప్ప‌టికైనా ఆలోచించాలి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here