ప్రొడ్యూసర్లుకి షాక్ ఇచ్చేలా బుట్టబొమ్మ రెమ్యూనరేషన్..!

వరుస హిట్స్ తో దోసుకుపోతున్న పూజ హెగ్డే భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె రెమ్యూనరేషన్ నిర్మాతలకు షాక్ ఇచ్చేలా ఉందట. ఏకంగా పూజ సినిమాకు రెండు కోట్లు డిమాండ్ చేస్తుందని సమాచారం. టాలీవుడ్ లో హీరోయిన్ కి రెండు కోట్లు అంటే పెద్ద మొత్తమే అని చెప్పాలి. లాక్ డౌన్ పరిస్థితుల వలన కుదేలైన నిర్మాతలకు ఇది పెను భారమే అని చెప్పాలి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన అల వైకుంఠపురంలో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

అలాగే పూజా హెగ్డే ప్రభాస్ భారీ పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ మూవీలో నటిస్తుంది. దానితో పాటు యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో కూడా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించడం విశేషం. మరి పూజ అంత డిమాండ్ చేస్తున్న పక్షంలో భవిష్యత్తులో ఆమె పట్ల నిర్మాతల తీరు ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here