తెలంగాణ: కొత్త సచివాలయం నమూనాలో మార్పులు చేసిన కేసీఆర్

చాలా అవాంతరాల అనంతరం తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులు దాదాపుగా పూర్తయిపోయాయి. ఈ క్రమంలోనే దీనిపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నమూనాలో మరికొన్ని మార్పులు చేశారు.

అయితే గతంలో సచివాలయ నమూనాలో ముఖ్యమంత్రికి మాత్రమే అన్ని సదుపాయాలు ఉండేటట్లుగా రూపొందింది. దీనిపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ తాజాగా మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్‌లు కూడా అన్ని సౌకర్యాలతో ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి అంతస్తులో డైనింగ్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాల్‌, అన్ని వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉండాలని సూచించారు. ఈ డిజైన్ ఖరారైతే టెండర్లను పిలిచి వీలయినంత త్వరగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here