సినిమా రివ్యూ: ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య‌

Release Date : 30 జులై, 2020
Starring : సత్యదేవ్, హరి చందన
Director : వెంకటేష్ మహా
Music Director : బిజిబాల్
Producer : విజయ ప్రవీణ పరుచురి, శోబు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని
Banner : మహాయన మోషన్ పిక్చర్స్-ఆర్కా మీడియా వర్క్స్

“కేరాఫ్ కంచరపాలెం” తరవాత దర్శకుడు వెంకటేష్ రెండో చిత్రంగా తెరకెక్కించిన సినిమా “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”. “బాహుబలి” అనంతరం ఆర్కా మీడియా సంస్థ ద్వారా విడుదలైన చిత్రం కావడంతో ఈ సినిమాపై ముందు నుంచీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కరోనా కారణంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!!

కథ:  మ‌హేష్ (స‌త్య‌దేవ్‌) ఓ ఫొటోగ్రాఫ‌ర్‌. త‌న జీవితం చాలా సింపుల్‌. గొడ‌వ‌ల‌కు పోయే ర‌కం కాదు. ఎదుటివాళ్ల‌దే త‌ప్పు అయినా, ఎందుకులే గొడ‌వ అని స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం క‌ల‌వాడు. అలాంటిది ఓరోజు అనుకోకుండా ఓ వీధి రౌడీతో దెబ్బ‌లాట‌కుదిగాల్సివ‌స్తుంది. ఊరి జ‌నం ముందు దారుణంగా త‌న్నులు తినాల్సివ‌స్తుంది. ఆ అవ‌మాన భారాన్ని మోయ‌లేక‌పోతాడు మ‌హేష్‌. త‌న‌ని కొట్టిన‌వాడ్ని మ‌ళ్లీ కొట్టేంత వ‌ర‌కూ చెప్పులు కూడా వేసుకోన‌ని శ‌ప‌థం చేస్తాడు. మరి మహేశ్ శపధం నెరవేర్చుకున్నాడా? 9 నంబర్ చెప్పులు మళ్ళీ వేసుకొన్నాడా లేదా? అనేది “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు:  సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ చాలా సహజంగా ఉంది. మనోడి మీసకట్టు, కొట్టొచ్చినట్లు కనబడే అమాయకత్వం, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ చాలా సహజంగా ఉంటాయి. సత్యదేవ్ తండ్రిగా నటించిన మలయాళ సీనియర్ నటులు రాఘవన్ చాలా బాగా చేసాడు. రూప కోడువయూర్ తెలుగు సినిమాకి దొరికిన మరో సహజమైన నటి. ఆమె కళ్లలోనే కాదు డైలాగ్ డెలివరీలోనూ మంచి మెరుపు ఉంది. నరేశ్-సుహాస్ ల కాంబినేషన్ భలే ఉంటుంది సినిమాలో. నరేశ్ తో సమానమైన నట ప్రతిభ కనబరిచాడు సుహాస్. అలాగే ఊరి పెద్ద పాత్రలో టి.ఎన్.ఆర్, రాంప్రసాద్ పాత్రలు ఆకట్టుకుంటాయి.

కేరాఫ్ కంచ‌ర‌పాలెం ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా మాతృక‌ని బాగా అర్థం చేసుకున్నాడు. సహజత్వాన్ని మించిన అందం లేదని నమ్మే అతికొద్ది మంది దర్శకుల్లో వెంకటేష్ ఒకడు. అందుకే అతడి మొదటి సినిమా “కేరాఫ్ కంచరపాలెం”తోనే ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయగలిగాడు. రెండో చిత్రంతోనూ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయగలిగాడు వెంకటేష్.

విశ్లేషణ: మంచోడి అనే ఒక చిన్న పాయింట్ తో తీసిన సహజమైన మంచి సినిమా ఇది. సొ, ఎలాంటి అంచనాలు లేకుండా కుటుంబంతో కలిసి సరదాగా చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here