మెగా డాటర్ నిశ్చితార్థం డేట్ ఫిక్స్.

మెగా డాటర్ నిహారిక ఇప్పుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. గుంటూరులో ఓ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తిని (చైతన్య) ఈమె పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా పెళ్లికి సంబంధించి తొలిమెట్టుకు ముహూర్తం ఫిక్స్ అయింది. నిహారిక-చైతన్యల నిశ్చితార్థానికి డేట్ లాక్ అయింది.

ఆగస్ట్ 13న నిహారిక-చైతన్యల ఎంగేజ్ మెంట్ జరగనుంది. హైదరాబాద్ లోనే నాగబాబు ఇంట్లో సింపుల్ గా ఈ ఎంగేజ్ మెంట్ ప్రాసెస్ ను పూర్తిచేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా కేవలం మెగా కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతారు.

నిహారిక వివాహం డిసెంబర్ లో జరుగుతుంది. తేదీ ఆల్రెడీ ఫిక్స్ చేసినప్పటికీ ఆ విషయాన్ని ఇంకా మెగా కాంపౌండ్ అధికారికంగా బయటపెట్టలేదు. డిసెంబర్ నాటికి కరోనా కల్లోలం తగ్గితే పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది. లేదంటే పెళ్లిని కూడా సింపుల్ గానే చేయాలనేది నాగబాబు ఆలోచన. నిహారిక-చైతన్యల పెళ్లి హైదరాబాద్ లోనే ఉంటుంది.

కొణిదెల వారి కుమారి శ్రీమతి కానుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here