బాల‌య్య‌తో అనిల్ రావిపూడి.. ఈ సారైనా వ‌ర్క‌వుట్ అవుతుందా..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కొత్త సినిమాపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఆయ‌న అనిల్ రావిపూడితో మూవీ చేసేందుకు ఓకే చేసిన‌ట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గ‌తంలోనే బాల‌కృష్ణ‌తో అనిల్ రావిపూడి సినిమా ఉంటుంద‌ని అంద‌రూ ఊహించారు. వీరి కాంబినేష‌న్‌లో సినిమా మంచి హిట్ కొడుతుంద‌ని అభిమానులు అనుకున్నారు. అయితే అప్ప‌ట్లో అది వ‌ర్క‌వుట్ కాలేదు. రామారావుగారు అనే సినిమా క‌థ‌ను అనిల్ గ‌తంలో బాల‌య్య‌కు చెప్పారు. అయితే ఎందుకో తెలియ‌దు బాల‌కృష్ణ సినిమాను ఓకే చేయ‌లేదు.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ఓ సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా నేప‌థ్యంలో గ్యాప్ వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు అనిల్ బాల‌య్య‌తో మీటింగ్ పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. బాల‌య్య‌కు క‌థ చెప్ప‌డంతో స‌రేన‌న్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదే నిజ‌మైతే బోయ‌పాటి సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ సారైనా వీరి కాంబినేష‌న‌ల్‌లో మూవీ రావాల‌ని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.  ఇప్ప‌టికే ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్ 2, స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాల‌తో అనిల్ మంచి ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here