పాకిస్థాన్‌లోనూ టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ..

టిక్ టాక్‌కు ఎక్క‌డ చూసినా ఎదురుదెబ్బ‌లే త‌గులుతున్నాయి. ముందుగా భార‌త్‌లో టిక్ టాక్‌ను నిషేధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోగా ఆ త‌ర్వాత అమెరికా కూడా ఇదే నిర్ణ‌యాన్ని తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ కూడా టిక్ టాక్ పై తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉంద‌ని తెలుస్తోంది.

టిక్‌టాక్‌లో అభ్యంత‌ర‌క‌ర‌మైన డేటాను తొల‌గించాల‌ని పాకిస్తాన్ అంటోంది. ముందుగా హెచ్చ‌రించినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో టిక్‌టాక్‌ను నిషేధం విదిస్తూ పాకిస్తాన్ టెలి క‌మ్యూనికేష‌న్ అథారిటీ నిర్ణ‌యం తీసుకుంది. టిక్‌టాక్‌లో అనైతిక అస‌భ్య‌క‌ర‌మైన స‌మాచారానికి వ్య‌తిరేకంగా ఫిర్యాదులు వ‌చ్చాయి. అందుకే పాకిస్తాన్ జులై నెల‌లోనే టిక్ టాక్‌కు సమాచారం అందించింది. స‌మ‌యం ఇచ్చి స‌రిచేసుకోమ‌ని చెప్పినా టిక్ టాక్ విన‌క‌పోవ‌డంతో ఇప్పుడు నిషేధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

కాగా దీనిపై టిక్ టాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే టిక్ టాక్‌కు యువ‌త‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అడ‌క్ట్ అయ్యార‌ని చెప్పొచ్చు. అయితే చిన్న చిన్న ఇబ్బందుల కార‌ణంగా టిక్ టాక్ నిషేధాలు ఎదుర్కొంటోంది. భార‌త్, అమెరికాల్లో దేశ పౌరుల భ‌ద్ర‌తను దృష్టిలో పెట్టుకొని నిషేధం విధించింది. అయితే పాక్‌లో మాత్రం అసభ్య‌క‌ర‌మైన స‌మాచారం ఉంద‌న‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. పాక్‌లో టిక్ టాక్‌ను 39 మిలియ‌న్ల డౌన్ లోడ్‌లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here