జూనియ‌ర్ ఎన్‌.టి.ఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారా.. ?

తెలుగుదేశం పార్టీకి కునుకు లేకుండా చేసే వార్తొక‌టి ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడ‌తార‌న్న వార్త‌లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఏ రోజైనా జూనియ‌ర్ టిడిపిలో చేర‌తార‌న్న న‌మ్మ‌కం చాలా మందిలో ఉండేది అయితే అనూహ్యంగా కొత్త పార్టీ ప్ర‌స్తావ‌న రావ‌డంతో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో చ‌ర్చ మొద‌లైంది.

నంద‌మూరి తార‌క రామారావు త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు తెలుగుదేశం పార్టీని లీడ్ చేసిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర రాజ‌కీయాల్లో చంద్ర‌బాబుది చెర‌గ‌ని ముద్ర‌గా చెప్పొచ్చు. అయితే చంద్ర‌బాబు ఓట‌మి చ‌వి చూసిన ప్ర‌తి సారి ఇక రాజ‌కీయాల్లోకి జూనియ‌ర్ ఎన్‌టిఆర్ రావాల్సిందేన‌న్న వార్తలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత జూనియ‌ర్ ప్ర‌స్తావ‌న కాస్త ఎక్కువైంద‌ని చెప్పొచ్చు.

ఇక చంద్ర‌బాబు మాత్రం త‌న‌యుడు లోకేష్‌పైనే ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన అతి త‌క్కువ కాలంలోనే లోకేష్ రాష్ట్ర మంత్రిగా అవ‌కాశం క‌ల్పించ‌డం కూడా లోకేష్‌ను ఏ రేంజ్‌లో పైకి తీసుకురావాల‌ని అనుకుంటున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఈ త‌రుణంలో జూనియ‌ర్ ఎన్.టి.ఆర్ ప్ర‌స్తావ‌న వ‌చ్చినప్పుడ‌ల్లా టిడిపి అధినేత కొట్టిపారేస్తార‌ని పొలిటిక‌ల్ సర్కిల్‌లో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

ఇక ఎన్‌.టి.ఆర్ టిడిపిలోకి వ‌స్తే రాష్ట్రమంతా తెలుగు త‌మ్ముళ్ల‌లో జోష్ వ‌స్తుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. ఎందుకంటే తాత‌య్య పోలిక‌ల‌తో జూనియ‌ర్ ప‌బ్లిక్‌లోకి వ‌స్తే ఊహ‌కంద‌ని ఫాలోయింగ్ సంపాదించుకుంటార‌ని రాజ‌కీయ మేధావుల మాట‌. అప్ప‌ట్లో తెలుగుదేశం త‌రుపున ప్ర‌చారానికి వ‌చ్చిన జూనియ‌ర్ ఆ త‌ర్వాత ఎన్నిక‌ల గురించి ఆలోచించ‌లేద‌ని తెలుస్తోంది. అయితే ఏదో ఒక రోజు ఎన్‌.టి.ఆర్ క‌చ్చితంగా రాజ‌కీయాల‌లోకి వ‌స్తార‌న్న‌ది నిజం.

ఇప్పుడు మ‌రో టాక్ ఉవ్వెత్తున ఎగిసిప‌డుతోంది. రాష్ట్ర మంత్రి కొడాలి నాని జూనియ‌ర్ ఎన్‌టి.ఆర్‌కు మంచి మిత్రుడ‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఆయ‌న మీడియా చిట్‌చాట్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. టిడిపి చంద్ర‌బాబు కుటుంబం చేతిలోనే ఉంటే భ‌విష్య‌త్తులో ఎన్‌.టి.ఆర్ క‌చ్చితంగా కొత్త పార్టీ పెట్టే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్పారంట‌. అయితే ఆయ‌న పార్టీ పెట్టినా చాలా క‌ష్ట ప‌డాల్సి వ‌స్తోంద‌ని అన్నారు. మ‌రి కొడాలి నాని వ్యాఖ్య‌లు చూస్తే క‌చ్చితంగా ఎన్‌.టి.ఆర్ కొత్త పార్టీ పెట్ట‌డం ఖాయ‌మ‌ని దాదాపుగా ఆయ‌న అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. మ‌రి ఇదే జ‌రిగితే తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది మ‌నం ఊహించుకోవ‌చ్చు.

ఇప్ప‌టికే రాష్ట్రంలో జ‌గ‌న్ ధాటికి టిడిపి అడ్ర‌స్ లేకుండా పోతోంద‌ని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఇక జూనియ‌ర్ కూడా రంగంలోకి దిగితే తెలుగుదేశం పార్టీ ఉండేది అని అనుకునేట్లుగా ప‌రిస్థితులు రావొచ్చేమో అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి జూనియ‌ర్ ఎన్‌.టి.ఆర్ విష‌యంలో ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. ఎన్‌.టి.ఆర్ స్వ‌యాన ప్ర‌క‌టిస్తే త‌ప్ప ఇలాంటి వార్తల్లో నిజ‌మెంతో మ‌నం ఊహించుకోలేము..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here