పుట్టినరోజు నాడు షూటింగ్ మొదలు పెట్టనున్న రజినీ..

కరోనా మహమ్మారి ప్రభావం సినిమా రంగంపై తీవ్రంగా పడిందనే విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు అన్ని షూటింగ్ లు వాయిదా పడ్డాయి. కేంద్రం ఇస్తోన్న సడలింపులతో ఇప్పుడిప్పుడే షూటింగ్ లు  తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇటీవలే నాగార్జున తన ‘వైల్డ్ డాగ్’ చిత్రాన్ని తిరిగి మొదలు పెట్టాడు. తాజాగా ఈ వరుసలోకి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వచ్చి చేరారు.

రజనీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తై’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. అయితే డిసెంబర్ 12 నుంచి సినిమా చిత్రీకరణను మళ్లీ మొదలు పెట్టడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అదే రోజు రజనీ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సినిమాలో రజినీ విభిన్న పాత్రలో నటించనున్నాడని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here