మ‌రోసారి భారీ ప్యాకేజీ ప్ర‌క‌టించ‌నున్న కేంద్రం..

కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో ప్యాకేజీకి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఊహించ‌ని విధంగా డ్యామేజ్ అయిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌రిచేసేందుకు కేంద్రం ఎప్పటిక‌ప్ప‌డు సిద్ధ‌మ‌వుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో అన్‌లాక్ 4 న‌డుస్తున్న ఈ ప‌రిస్థితుల్లో ఏ ఏ రంగాల‌పై దృష్టి పెట్టాలో క్లారిటీగా ప్యాకేజీలో తెలుప‌నుంది.

క‌రోనా మమ‌హ్మారి కార‌ణంగా భార‌త్ ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది. దీంతో ఇప్ప‌టి నుంచే ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకునేందుకు కీల‌క‌మైన క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సారి ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతితో పాటు చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. పండుగలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుండ‌టంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు మోడీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

ఏం చ‌ర్యలు తీసుకోవాల‌న్న దానిపై ప్ర‌భుత్వ అధికారులు కార్పోరేట్ నేత‌ల‌తో స‌మావేశం అవుతున్నార‌ని స‌మాచారం లీకైంది. దీంతో మాండ్‌ విపరీతంగా పడిపోయిన క్రమంలో డిమాండ్‌ను పెంచే చర్యలు చేపట్టాలని వ్యాపార వర్గాలు ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చాయి. రాబోయే ప్యాకేజీలో కేవ‌లం చిన్న వ్యాపార‌స్తులు, మ‌ధ్య త‌ర‌గ‌తికి మేలు చేసే విధంగానే ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. కాగా కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం కూడా కేంద్రానికి లేఖ రాశారు. ప్ర‌పంచ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్న విష‌యం తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here