హనీ ప్రీత్ ఎక్కడికి పారిపోయిందో తెలుసా ? ఇప్పుడు ఎక్కడ తల దాచుకుంటోంది అంటే ..

డేరా బాబా కి కూతురు గా హీరోయిన్ గా చేసిన హాని ప్రీత్ కి సంబంధించి పోలీసులు ఇంకా విచారణ, చేజింగ్ చేస్తూనే ఉన్నారు. హర్యానా లోని డేరా సచ్చా సౌద చీఫ్ గుర్మీత్ రాం కి జైలు శిక్ష పడిన తరవాత జరిగిన అతి గొప్ప విధ్వంసం కేసులో ఆమె కీలక నిందితురాలు.ఆమెని కోర్టులో ప్రొడ్యూస్ చెయ్యడం కోసం పోలీసులు సర్వ్య ప్రయత్నాలూ చేసినా ఎక్కడా ఏదీ వర్క్ అవుట్ కాలేదు. ఆమె ప్రస్తుతం పరారీ లో ఉంది. ఆమె ప్రస్తుతం నేపాల్ లో ఉన్నట్టు తెలుసుకున్న అధికారులో ఆమె కోసం ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారు. సిర్సా డేరాకు అనుబంధంగా ఉదయ్ పూర్ లో నడుస్తున్న డేరా ఆశ్రమ ఇన్ చార్జ్ ప్రదీప్ గోయల్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని విచారించి హనీప్రీత్ ఎక్కడుందన్న విషయాన్ని కూపీ లాగారని తెలుస్తోంది. ఆమె ఎక్కడ ఉంది ఎవరు ఆమెకి షెల్టర్ ఇస్తున్నారు అనే విషయాల మీద ప్రదీప్ అనే వ్యక్తి నుంచి కీలక ఆధారాలు తీసుకున్నారు పోలీసులు. ఆమెని త్వరలో ఇండియా కి తీసుకొచ్చి కోర్టు లో ప్రవేశ పెడతాం అంటున్నారు వాళ్ళు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here