నాల్గవసారి మహేష్ vs ఎన్టీఆర్ యుద్ధం .. గెలవబోయేది ఎవరు

సినిమా లవర్స్ మధ్యన ఇప్పుడు గట్టి చర్చ జరుగుతోంది. దసరా సినిమాల విషయం లో జై లవకుశ vs మహేష్ బాబు స్పైడర్ పోటా పోటీ గా రాబోతూ ఉండడం తో ఇప్పుడు ఈ రెండు సినిమాల మీదనే ట్రేడ్ వర్గాల కన్ను కూడా పడింది. దసరా సీజన్ లో కాంపిటీషన్ కి సిద్ధమైన ఈ ఇద్దరూ ఇదివరకు కూడా రెండు మూడు సార్లు తలపడ్డారు. 2003లో ఎన్టీఆర్ ‘నాగా’, మహేష్ ‘ఒక్కడు’ విడుదలయ్యాయి. ‘నాగా’ అట్టర్ ఫ్లాప్ కాగా, ‘ఒక్కడు’ ఘన విజయాన్ని అందుకుంది. ఆపై 2010లో మహేష్ ‘ఖలేజా’, ఎన్టీఆర్ ‘బృందావనం’ ఒకే సమయంలో పోటీ పడ్డాయి. అప్పుడు మాత్రం విజయలక్ష్మి ఎన్టీఆర్ ను వరించింది. మూడవ సారి 2011 లో ఊసరవల్లి – దూకుడు ఒకేసారి విడుదల అవ్వగా ఊసరవల్లి కి ఓపెనింగ్ లు బాగా వచ్చాయి కానీ దూకుడు కలక్షన్ లలో విజయం సాధించింది. అయితే ఈ నాల్గవసారి దసరాకి రాబోతున్నారు వీరిద్దరూ .. తన గెలుపు చూపించుకుని లెక్క సమం చెయ్యాలి అని చూస్తున్నాడు ఎన్టీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here