స‌రికొత్త క‌రోనా టెస్టింగ్ మిష‌న్‌.. ఒక్క నిమిషంలోపే ఫ‌లితం..

క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌ధానంగా వైర‌స్‌ను క‌నిపెట్ట‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశం. దీంతో వైర‌స్ సోకిన వారు చికిత్స తీసుకొని కోలుకునే అవ‌కాశం చాలా ఉంది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా క‌రోనా టెస్టులు చేయ‌డ‌మే పెద్ద స‌వాల్‌గా మారింది. టెస్టుల ఫ‌లితాలు ఆల‌స్య‌మ‌వ్వ‌డం వ‌ల‌న వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంది.

అయితే వైర‌స్‌ను కేవ‌లం ఒకే నిమిషంలో గుర్తించే పరిజ్ఞానాన్ని శాస్త్ర‌వేత్త‌లు త‌యారు చేశారు. భార‌త్ ఇజ్రాయిల్ శాస్త్ర‌వేత్త‌లు క‌లిసి దీన్ని రూపొందించారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే మ‌రో రెండు మూడు వారాల్లో ఇది అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంటున్నారు. దీని వ‌ల్ల ఒక నిమిషంలోనే కరోనా ఫ‌లితం క‌నుక్కోవ‌చ్చు. ఇప్ప‌టికే ర్యాపిడ్ టెస్టులు చేయ‌డం వ‌ల్ల కొన్ని నిమిషాల్లో ఫ‌లితాలు తెలుస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ శాస్త్ర‌వేత్త‌లు బ్రీత్ అన‌లైజ‌ర్‌తో పాటు, వాయిస్ టెస్టుతో పాటు మ‌రో రెండు విభిన్న ప‌రిక‌రాల‌తో వైర‌స్‌ను క‌నుగొనేందుకు ప్ర‌యోగాలు చేశారు. ఓపెన్ స్కై పేరుతో పిలిచే ఈ ప‌రిజ్ఞానం ద్వారా ట్యూబ్‌లో వ్య‌క్తి ఊదితే వెంట‌నే ఒక్క నిమిషంలోనే ఫ‌లితం తెలిసిపోతుంది. ఇది విమానాశ్ర‌యాలు, రైల్వే స్టేష‌న్ల‌లో వేగంగా ఫ‌లితం తెలుసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది అందుబాటులోకి వస్తే కోట్లాది జ‌నాభా ఉన్న భార‌త్ లాంటి దేశాల్లో వేగంగా వైర‌స్‌ను గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అవ్వ‌డం ఎంతో శుభ‌ప‌రిణామం అని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here