కాంచనాను దింపేశారుగా.!

రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ముని2: కాంచన’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కామెడీ, హర్రర్‌ రెండూ కలగలిపి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ‘లక్ష్మీ బాంబ్‌’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు రాఘవా లారెన్స్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా నవంబరు 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తాజాగా చిత్ర యూనిట్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ మొత్తం అక్షయ్‌ వన్‌ మ్యాన్‌ షోలా కనిపిస్తోంది. ఇక పలు పాత్రల్లో అక్షయ్‌ తనదైన నటనను ప్రదర్శించాడు.. ముఖ్యంగా కాంచన పాత్రలో మహిళగా అక్షయ్‌ నటన ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్‌ను గమనిస్తే.. అచ్చంగా కాంచనాను దించేసినట్లనిపిస్తోంది. మరి కథ విషయంలోనైనా ఏమైనా మార్పులు ఉన్నాయా? లేదా అది కూడా పూర్తిగా దక్షిణాది కాంచనానే పోలి ఉంటుందా చూడాలి. ఇక ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌కు జోడిగా కియారా అద్వాని నటిస్తోంది. మరి ఈ సినిమాతో లారెన్స్‌ కు బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here