నా క‌ల నెర‌వేరింది.. అద్వానీ

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌డం ద్వారా త‌న క‌ల సాకార‌మైంద‌ని బీజేపీ నేత ఎల్‌.కె అద్వానీ అన్నారు. అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం నాతో స‌హా భార‌తీయులంద‌రికీ ఉద్వేగపూరిత క్ష‌ణ‌మ‌న్నారు.

రామాల‌య నిర్మాణ పోరాట‌ చ‌రిత్ర ముందు వ‌రుస‌లో ఉన్న వారిలో అద్వానీ ఒక‌రు. దీనిపై ఆయ‌న మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పులో రామ మందిర నిర్మాణం జ‌ర‌గ‌డం శుభ ప‌రిణామ‌మ‌ని అన్నారు. ప్రధాని న‌రేంద్ర‌మోడీ భూమి పూజ చేయ‌డం చ‌రిత్రాత్మ‌క‌మ‌ని చెప్పారు. కాగా అద్వానీతో పాటు ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషితో స‌హా ప‌లువురు ఈ భూమి పూజ కార్య‌క్ర‌మంలో వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా పాల్గొన‌నున్నారు.

రాముని స‌ద్గుణాల‌ను అంతా అల‌వ‌ర్చుకోవాల‌న్నారు. సుప‌రిపాల‌న‌, అంద‌రికీ న్యాయం, సిరి సంప‌ద‌ల‌కు రామ రాజ్య‌మే ఉదాహ‌ర‌ణ అన్నారు. రామ జ‌న్మ‌భూమిలో మందిర నిర్మాణం బీజేపీ క‌ల అన్నారు అద్వానీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here