మెగాస్టార్‌, సూప‌ర్ స్టార్ ఏం చేస్తారో..

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మ‌హేష్ బాబుల నుంచి అభిమానులకు ఏదో గుడ్ న్యూస్ రాబోతోంది. ఈ నెల‌లోనే వీరిద్ద‌రి బ‌ర్త్‌డేలు ఉండ‌టంతో కొత్త సినిమాల స‌మాచారం వ‌స్తుందని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

త‌మ అభిమాన హీరో బ‌ర్త్ డే వ‌స్తుందంటే చాలు కొత్త సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ కానీ, ఫోటోలు కానీ విడుద‌ల చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. అయితే ఇది క‌చ్చితంగా జ‌రుగుతుంది. అయితే ఈ సారి లాక్‌డౌన్ వ‌ల్ల సినిమాలు లేక‌పోవ‌డంతో షూటింగ్‌లు జ‌ర‌గలేదు. అయిన‌ప్ప‌టికీ స్టార్ హీరోల బ‌ర్త్‌డేలు వ‌స్తున్నాయంటే చాలు ఏదో ఒక ఎక్స్‌పెక్టేష‌న్ ఉంటుంది.

ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే. చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ కానీ టీజ‌ర్ కానీ విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 50శాతం పూర్త‌యింద‌ని తెలుస్తోంది. క‌రోనా ప‌రిస్థితులు చక్క‌బ‌డితే మిగ‌తా షూటింగ్ కాస్త పూర్తి చేసేందుకు చిత్ర బృందం రెడీగా ఉంది. ఈ నేప‌థ్యంలో చిరు బ‌ర్త్ డే సంద‌ర్బంగా టీజ‌ర్ లేదా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తార‌ని అంతా అనుకుంటున్నారు.

మెగాస్టార్ ఇంట్లో రాఖీ సంద‌డి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here