మెగాస్టార్ ఇంట్లో రాఖీ సంద‌డి..

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. రక్షా బంధ‌న్ సంద‌ర్బంగా ఆయ‌న రాఖీ సెల‌బ్రేష‌న్స్‌లో మునిగిపోయారు.

అంద‌రికీ మెగాస్టార్ చిరంజీవి రక్షా బంధ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న ఇంట్లో కూడా రాఖీ సంద‌డి నెల‌కొంది. రక్షా బంధ‌న్ సంద‌ర్బంగా మెగాస్టార్‌కు ఆయ‌న చెల్లెల్లు రాఖీ క‌ట్టారు. అనంత‌రం ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా వారితో గ‌డిపిన వీడియోను చిరంజీవి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

కేవ‌లం నా చెల్లెల్ల‌తోనే కాకుండా తెలుగింటి ఆట‌ప‌డుచుల‌తో అన్న‌య్య అని పిలిపించుకునే అదృష్టం నాకు ద‌క్కింద‌ని చిరు అన్నారు. కాగా ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అయ్యింది. చిరు అభిమానులు దీన్ని షేర్ చేస్తూ రాఖీ శుభాకాంక్ష‌లు అన్న‌య్యా అంటూ ట్వీట్ చేస్తున్నారు.

Megastar Raksha Bandhan Celebrations.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here