రామ మందిర భూమిపూజ‌ను ఆపాలి.. దిగ్విజ‌య్ సింగ్‌

అట్ట‌హాసంగా అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ భూమి పూజ‌కు ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గా దీన్ని ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజ‌య్ సింగ్ న‌రేంద్ర మోధీని కోరారు. క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో ఈ కార్య‌క్ర‌మం ఇప్పుడు నిర్వ‌హించ‌డం మంచిది కాద‌న్నారు.

ఈ నెల 5వ తేదీన అయోధ్య‌లో నిర్వ‌హించే రామ మందిర భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని నిలిపివేయాల‌ని దిగ్విజ‌య్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా అన్నారు. బుధ‌వారం జ‌ర‌గాల్సిన ఈ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేయాల‌న్నారు. రామ‌మందిర భూమి పూజ ఆచారాల‌తో ఎంత మందిని ఆస్ప‌త్రుల‌కు పంపించాల‌ని అనుకుంటున్నారన్నారు. కార్య‌క్ర‌మంలో పాల్గొనే ముఖ్య నేత‌లు, పూజారులు ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డ్డార‌న్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. పీఎం మోధీతో మాట్లాడి భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని ఆపాల‌ని సూచించారు. హోమంత్రి అమిత్‌షా కూడా క‌రోనా బారిన ప‌డిన విషయాన్ని గుర్తు చేశారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో భూమి పూజ‌కు ముహూర్తం నిర్ణ‌యించ‌డం అనుకూలం కాద‌న్నారు.

అయోధ్య రామాలయ నిర్మాణంలో ఎన్నో విశేషాలు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here