తాప్సీ విష‌యంలో హృతిక్ ఎందుక‌లా మాట్లాడారు..

హీరోయిన్‌ తాప్సీని బాలివుడ్ హీరో హృతిక్ రోష‌న్ పొగిడేశారు. తాప్సీ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ఆయ‌న తాప్సీకి విశెష్ చెప్పారు. అయితే ఇది ఎందుకంత స్పెష‌ల్ అంటే అభిమానులే స‌మాధానం చెబుతున్నారు.

బాలివుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న తాప్సీ దూసుకుపోతోంది. పాత్ర‌ల‌తో సంబంధం లేకుండా న‌ట‌నకే ప్రాధాన్య‌త ఇస్తూ ఆమె ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ అయ్యింది. తాజాగా తాప్సీ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా నీ అభిమాని నుంచి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తాప్సీ.. ఈ సంవ‌త్స‌ర ఎంతో బాగుండాలి. బిగ్ హ‌గ్ అని హృతిక్ రోష‌న్ ట్విట్ట‌ర్ ద్వారా ఆమెకు విశెష్ తెలియ‌జేశారు. దీనికి స్పందించిన తాప్సీ ఈ మెసేజ్ చూసిన త‌ర్వాత త‌న‌కు ఎలా స్పందించాలో తెలియ‌డం లేద‌న్నారు.

నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నారు. థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చారు. అయితే తాప్సీకి బ‌ర్త్‌డే విశెష్ చెప్పేందుకు హృతిక్ ఎందుకంత ఇంట్ర‌స్ట్ చూపించార‌ని సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. గ‌తంలో హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌, హృతిక్ మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం కాస్త వివాదాల‌కు దారి తీసింది. అయితే ఇప్పుడు తాప్సీ కంగ‌నాకు వ్య‌తిరేకంగా మాట్లాడుతోంది. ఇందుకే హృతిక్ ఇలా తాప్సీపై స్పందించార‌ని అంటున్నారు.

హృతిక్ రోషన్ ఈ సాహ‌సం చేస్తాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here