హృతిక్ రోషన్ ఈ సాహ‌సం చేస్తాడా..?

సినిమాలంటే భాష ఒక్క‌టే కాదు.. ఏ భాషైనా చూస్తాం.. అభిమాన‌మంటే ప్రాంతీయ‌మే కాదు ఏ హీరోనైనా అభిమానిస్తాం.. అనే రోజులివి. ఎందుకంటే తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం అనే తేడా లేకుండా అన్ని లాంగ్వేజ్‌ల సినిమాలు ఇప్పుడు చూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో హృతిక్ రోష‌న్ గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మూవీ రిలీజ్ అయ్యిందంటే చాలు దేశంలో అన్ని ప్రాంతాల్లో ఆయ‌న అభిమాన‌ల‌కు పండ‌గే. అంతలా ఆయ‌న త‌న ప‌ర్‌ఫామెన్స్‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. క‌హోనా ప్యార్ హై నుంచి క‌బి కుషి క‌బీ గయ్‌, కోయి మిల్ గ‌యా, క్రిష్‌, ధూమ్ 2, వార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్ర‌తి సినిమాలో ఆయ‌న త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూనే ఉన్నారు.

ఇప్పుడు తాజాగా క్రిష్ 4 కూడా చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌న తండ్రి రాకేష్ రోష‌న్ డైరెక్ష‌న్‌లోనే ఇది రూపొంద‌నుంది. కాగా కోయి మిల్ గ‌యాలోని గ్ర‌హాంత‌ర వాసి పాత్ర కూడా ఈ సినిమాలో ఉన్న‌ట్లు పుకార్లు బ‌య‌ట‌కొచ్చాయి. అంతే కాకుండా క్రిష్ 4లో హృతిక్ నాలుగు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సింగిల్‌గా వ‌చ్చినా హృతిక్ స్టైల్ వేరుగా ఉంటుంది. అలాంటిది నాలుగు రూపాల్లో వ‌స్తే ఇక ఏ విధంగా ఉంటుందో మ‌రి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here