చంద్ర‌బాబు కుట్ర‌లు, కుతంత్రాలు మానుకోవాలి : మంత్రి అనిల్‌

రాష్ట్రం విడిపోయిన‌ప్పుడు చంద్ర‌బాబు ఇంత గ‌గ్గోలు పెట్ట‌లేద‌ని మంత్రి అనిల్‌ కుమార్ అన్నారు. ఆయ‌న‌కు, ఆయ‌న బినామాల‌కు ఉండే ల్యాండ్ రేట్లు ప‌డిపోతాయ‌నే ఇలా చేస్తున్నార‌న్నారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే వై.ఎస్ జ‌గ‌న్ అమ‌రావతిలో ఇల్లు క‌ట్టుకున్నార‌ని.. ఇక చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా అమ‌రావ‌తిలో సొంత ఇల్లు క‌ట్ట‌లేద‌న్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే ఎవ‌రికి అమ‌రావ‌తిపై ప్రేమ ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌న్నారు. నేటికీ చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లోనే ఉన్నార‌న్నారు. చుట్ట‌పు చూపుగా ఏపీకి వ‌చ్చి వెళుతున్నార‌ని చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు.

చంద్ర‌బాబు క‌ప‌ట నాట‌కాలన్నీ మానుకోవాలన్నారు. జ‌గ‌న్ అభివృద్ధి, సంక్షేమం ఏంటో 2024 ఎన్నిక‌ల్లో తీర్పు వ‌స్తుంద‌న్నారు. మా నిర్ణ‌యం త‌ప్పు అని చంద్ర‌బాబు చెప్ప‌ద‌లుచుకుంటే 23 మంది ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి చంద్ర‌బాబు ఎన్నిక‌లకు వెళ్లాల‌న్నారు. ద‌మ్ము ధైర్యం ఉంటే చంద్ర‌బాబు రాజీనామాలు చేసి ఎన్నిక‌ల‌కు రావాల‌న్నారు. చంద్ర‌బాబును ఉద్దేశించి మాట్లాడుతూ నీ సీటునే కైవసం చేసుకో చూద్దాం అన్నారు.

ఇక ప‌వ‌న్ గురించి ఏం చెప్పాలో అర్థం కావ‌డం లేద‌న్నారు. ఓ రోజు ఎవరికి స‌పోర్టు చేస్తారో ఏం మాట్లాడ‌తారో తెలియ‌ద‌న్నారు. ఇక చంద్ర‌బాబు కుట్ర‌లు, కుతంత్రాలు, చిల్ల‌ర రాజ‌కీయాలు ద‌య‌చేసి మానుకోవాల‌న్నారు. ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి స్పూర్తితో చంద్ర‌బాబు ఎమ్మెల్యేల‌తో కూడా రాజీనామా చేయించాల‌న్నారు.

ఆస్తులు కాపాడుకోవ‌డం కోస‌మే చంద్ర‌బాబు ఉద్యమమా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here