అయోధ్య రామాలయ నిర్మాణంలో ఎన్నో విశేషాలు!!

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో నిర్వాహకులు వేగంగా పనులు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవ్వనున్నది తెలిసిందే.

ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ నిర్మాణంలో ఎన్నో విశేషాలు చోటుచేసుకొనున్నాయి. ఇందులో భాగంగా రామ జన్మభూమికి సంబంధించిన పూర్తి చరిత్రను అక్కడే భూగర్భంలో ఉంచి నిర్మించేందుకు రామాజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  సిద్ధమవుతోంది.

నిర్మాణం జరిగే స్థలంలో 2వేల అడుగుల లోతులో ఒక టైం క్యాప్సూల్ (కాల నాలిక) ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకుండా ఇదంతా చేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. కాల నాలికను కాపర్ ప్లేట్ లో ఉంచి భూగర్భంలో భద్రపరుస్తామని చెప్పారు. ఇందులో ఆలయ చరిత్రతో పాటు కీలక పరిణామాల సమాచారం ఉంటుందన్నారు.

ఇక నిర్మాణంలో భాగంగా శ్రీరాముడు తిరిగిన పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదుల నుండి నీరు, మట్టి తీసుకొస్తున్నారు. కర్నూల్ జిల్లాలోని సంగమేశ్వరం ఆలయం పవిత్ర జలాలు, మృతికను పంపిస్తున్నారు. ఇక్కడ కృష్ణ, తుంగ, భద్ర, మలాప హారిని, భవనాశి, భీమ రధీ, వేణి అనే సప్తనదులు ఇక్కడ కలుస్తాయి. దీంతో ఈ జలాలను రామాలయం నిర్మాణానికి పంపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here