బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అరెస్ట్ కి రంగం సిద్ధం..?

బాలీవుడ్ లో సంచలనం నమోదు కానుందా? సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి అరెస్ట్ కానుందా? అంటే, అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సుశాంత్ సింగ్ ఆత్మ హత్య కేసులో అనేక మందిని విచారించిన పోలీసులు ఎక్కువగా రియా చక్రవర్తిని ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో ఆమెను అనేకమార్లు పోలీసులు స్టేషన్ కి పిలిపించడం జరిగింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి పలుమార్లు ఆమెకు ఫోన్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.

 

దీనితో సుశాంత్ సింగ్ ఆత్మ హత్యకు ఈమె ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ సాగుతుంది. కాగా సుశాంత్ తండ్రి కొన్ని బలమైన ఆధారాలతో ఆమెపై బీహార్ లో కేసుపెట్టారు. దీనితో బీహార్ పోలీసులు ముంబైలో దిగారట. పలు సెక్షన్స్ క్రింద రియా పై కేసు నమోదు కాగా ఆమె అరెస్ట్ అనివార్యం అంటున్నారు. ఇప్పటికే రియా తన లాయర్ ని సంప్రదించారని తెలుస్తుంది. తాజా పరిణామాలు గమనిస్తుంటే…సుశాంత్ ఆత్మ హత్య కేసులో కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు రేగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here