మా కూతురు ఎప్పుడూ గ‌ర్బం దాల్చ‌లేదు

బాలివుడ్ హీరో సుశాంత్ రాజ్‌పూత్ మృతి వ్య‌వ‌హారం తీవ్ర వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. అయితే సుశాంత్ మాజీ మేనేజ‌ర్ దిశ మృతికి సంబంధించి వ‌స్తున్న కామెంట్ల‌పై ఆమె తండ్రి స్పందించారు. ద‌య‌చేసి ఇలాంటి మాట‌లు మాట్లాడ‌వద్ద‌న్నారు.

సుశాంత్ చ‌నిపోయేందుకు వారం రోజుల ముందు దిశ చ‌నిపోయింది. దీంతో వీరిద్ద‌రి మృతికి ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో  బీజేపీ ఎంపీ నారాయ‌ణ్ రాణే దిశ‌ది ఆత్మ‌హ‌త్య కాద‌ని లైంగిక దాడికి పాల్ప‌డి హ‌త్య చేశార‌ని కామెంట్ చేశారు. ఇలా రోజురోజుకూ వివిధ రూపాల్లో అంద‌రూ స్పందిస్తుండ‌టంతో దిశ త‌ల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు.

త‌మ కూతురు గర్భ‌వ‌తి కాద‌ని.. ఇప్పుడే కాదు ఎప్పుడూ త‌ను గ‌ర్బం దాల్చ‌లేద‌న్నారు. త‌న‌పై ఎన్న‌డూ అత్యాచారం కూడా జ‌ర‌గ‌లేద‌న్నారు. త‌న అవ‌య‌వాల‌కు సంబంధించిన రిపోర్టుల‌న్నీ స్ప‌ష్టంగా ఉన్నాయ‌ని తెలిపారు. త‌న గురించి వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అస‌త్యాలే అని.. ద‌య‌చేసి ఆమెకు చెడ్డ‌పేరు తెచ్చేలా ప్రచారం చెయ్యొద్ద‌న్నారు.

సుశాంత్ మృతి వెనుక ఏం జరిగింది..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here