సుశాంత్ మృతి వెనుక ఏం జరిగింది..?

బాలివుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ మృతి వ్య‌వ‌హారం కొలిక్కి రావ‌డం లేదు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా లేదా ఎవ‌రైనా హ‌త్య చేశారా అన్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు వచ్చిన నేప‌థ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కూడా కేసు న‌మోదు చేసింది.

సుశాంత్ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న దేశంమొత్తాన్ని దిగ్బ్రాంతికి గురి చేసిన విష‌యం తెలిసిందే. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఆయ‌న ఉదంతం స‌మిసిపోవ‌డం లేదు. ఈ వ్య‌హారంలో ముంబై పోలీసులు స‌హ‌కరించ‌డం లేద‌ని బీహార్ పోలీసులు అంటున్నారు. సుశాంత్ రూమ్ తాళాలు తెరిచేందుకు వ‌చ్చిన కీ మేక‌ర్‌ను గుర్తించారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య సీన్‌ని రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేశారు.

న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి, సుశాంత్ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ కేసు ఊహించ‌ని విధంగా మ‌లుపులు తిరుగుతోంది. రియాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు సుశాంత్ కు సంబంధించిన 15కోట్లు మ‌నీలాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు సుశాంత్ తండ్రి ఫిర్యాదులో పేర్కొన‌డంలో ఈడీ రంగంలోకి దిగింది. అయితే బీహార్ పోలీసుల త‌నిఖీల్లో సుశాంత్ ఖాతా నుంచి రియా ఖాతాలోకి పెద్దగా న‌గ‌దు బ‌దిలీ కాలేద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అయితే సుశాంత్ ఇంటిలో ఉండే సిబ్బంది మాత్రం రియా ఇంట్లో ఉన్న‌న్ని రోజులో సుశాంత్ వ్య‌వ‌హార‌మంతా ఆమె క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేద‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. ఆమె అనుమ‌తి లేనిదే సుశాంత్ రూమ్‌లోనికి ఎవ్వ‌రూ అడుగుపెట్టే వారు కాద‌ని స‌మాచారం. కాగా ఈ విష‌యంలో సుశాంత్ బాడీగార్డ్ నోరు విప్పారు. సుశాంత్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా రియా పార్టీలు చేసుకునేద‌ని ముంబై పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఆమె ఇంటికి వ‌చ్చాక ఇంట్లోకి బంధువులు, స్నేహితులు రావ‌డం త‌గ్గింద‌న్నారు.

సుశాంత్ మాజీ ప్రేమికురాలు అంకిత లోఖండే వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. తాజాగా ఆమె ఇంటికి ఆటోలో వెళ్లిన పోలీసులు వ‌చ్చేట‌పుడు జాగ్వార్ కారులో బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు పోల‌సుల ద‌ర్యాప్తులో మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట ప‌డింది. సుశాంత్ వాడుతున్న సిమ్ కార్డుల్లో ఏవీ త‌న పేరు మీద లేవ‌ని తేలింది. కొన్ని నెల‌లుగా సిమ్ కార్డులు మారుస్తున్నార‌ని బీహార్ పోలీసులు తెలిపారు. వీటిలో ఆయ‌న పేరు మీద ఏవీ లేవ‌న్నారు.

కాగా సుశాంత్ మృతి వ్య‌వ‌హారం తేలాలంటే టైం ప‌ట్టేలా క‌నిపిస్తోంది. ఇక ఆయ‌న అభిమానులు మాత్రం ఈ విష‌యాల‌న్నింటిపై మండిప‌డుతున్నారు. మంచి భ‌విష్య‌త్తు ఉన్న హీరో జీవితం ఇలా చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here