అక్క‌చెల్లెమ్మ‌ల‌కోసం వై.ఎస్ జ‌గ‌న్ “ఈ ర‌క్షాబంధ‌న్‌”

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ ఈ ర‌క్షా బంధ‌న్ కార్యక్ర‌మాన్ని ప్రారంభించారు. రాఖీ పండుగ రోజున రాష్ట్రంలోని బాల‌లు, మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం పోలీస్ శాఖ‌, సీఐడి విభాగం సంయుక్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. నేడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు.

రాష్ట్రంలో సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి మ‌హిళ‌ల‌ను ర‌క్షించేందుకు సీఎం వై.ఎస్ జ‌గ‌న్ ఈ ర‌క్షాబంధ‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.  రాష్ట్రంలోని అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ర‌క్షా బంధ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. యూట్యూబ్ ద్వారా స్కూళ్లు, కాలేజీల్లో సైబ‌ర్ సెక్కూరిటీ నిపుణుల‌తో నెల రోజుల పాటు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. మ‌హిళ‌ల భ‌ద్రత కోసం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ ఈ సంద‌ర్బంగా చెప్పారు.

రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మ‌ల‌కు ఏదైనా ఇబ్బందులు ఉంటే దిశ పోలీస్ స్టేష‌న్, దిశ యాప్ ఉప‌యోగించుకొని ఫిర్యాదులు చేయాల‌ని సీఎం భ‌రోసా ఇచ్చారు.  30 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల పేరుతో ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌బోతున్నామ‌న్నారు. బెల్ట్ షాపులు, ప‌ర్మిట్ షాపులు పూర్తిగా తొల‌గించామ‌ని జ‌గ‌న్ చెప్పారు. రాఖీ పండుగ సంద‌ర్బంగా మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌తో పాటు ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని, త‌దిత‌రులు సీఎం జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here