రజినీకాంత్ కొత్త సినిమా.. షూటింగ్ మొత్తం అక్కడే

సుప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. ముందుగా హైద‌రాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేశారు. అయినా చివ‌ర‌కు మాత్రం సెట్ క్యాన్సిల్ చేసి చెన్నైని ఫిక్స్ చేశారు.

క‌బాలి, కాలా, 2.0, ద‌ర్బార్ చిత్రాల‌తో దూసుకుపోతున్న ర‌జినీకాంత్ లాక్‌డౌన్ కార‌ణంగా వ‌చ్చిన గ్యాప్‌ను బ‌ర్తీ చేయాల‌ని రెడీ అవుతున్నారు. అంద‌రి హీరోల్లాగే ధైర్యం చేసి సినిమా షూటింగ్‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు ర‌జినీ. ర‌జినీ కాంత్ హీరోగా డైరెక్ట‌ర్ శివ ఓ సినిమాను తీస్తున్నారు. దీనికి అన్నాత్తే అనే పేరు ఫిక్స్ చేశారు.

అయితే ఈ సినిమా షూటింగ్‌ను హైద‌రాబాద్‌లో తీయాల‌ని చిత్ర బృందం నిర్ణ‌యించింది. అయితే క‌రోనా విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో ఇత‌ర రాష్ట్రాల‌లో షూటింగులు వ‌ద్ద‌ని మ‌ళ్లీ హైద‌రాబాద్‌ను క్యాన్సిల్ చేశారు. ఇప్ప‌డు చెన్నైలోనే ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాదిలో సినిమాను రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే స‌రైన స‌మాయానికే మూవీ రిలీజ్ అవ్వ‌నుంది. ఈ సినిమాలో మీనా, కుష్షు, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here