అప్పుడు చంద్ర‌బాబు మమ్మ‌ల్ని అడ‌గలేదు.. బీజేపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తోంద‌ని ఆ పార్టీ  ఉపాధ్య‌క్షుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్టును కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ చ‌దువుతున్నాయ‌న్నారు.

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎంపిక చేసిన స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు అడ‌గ‌లేద‌ని ఆయ‌న ప‌రోక్షంగా మాట్లాడారు. రాజ‌ధానిపై చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాన్నే కేంద్రం ఆమోదించింద‌న్నారు. ఇక అమ‌రావ‌తిపై కొంద‌రు నేత‌లు ప‌నిగ‌ట్టుకొని అమిత్‌షాకు లేఖ‌లు రాస్తున్న‌ర‌న్నారు.

ఇక బీజేపీ నేత‌లు క‌ర్నూల్లో హైకోర్టు పెట్టాల‌ని అప్పుడు చంద్ర‌బాబును కోరింద‌ని.. కానీ ఆయ‌న అమ‌రావ‌తిలోనే హైకోర్టు ఏర్పాటుచేశార‌న్నారు. ఈ విష‌యంలో కూడా కేంద్రం ఓకే చెప్పింద‌న్నారు. రాజ‌ధాని అంశం రాష్ట్ర ప‌రిధిలోనిదే అని కేంద్రం స్ప‌ష్టంగా చెప్పింద‌న్నారు.

గ‌తంలో మోడీ గో బ్యాక్ అన్న చంద్ర‌బాబు ఇప్పుడు మోడీ కం బ్యాక్ అంటున్నార‌న్నారు. చంద్ర‌బాలు లోకేష్‌లు జూమ్‌ను వీడి అమ‌రావ‌తికి వ‌చ్చి రైతుల‌తో మాట్లాడాల‌న్నారు. అమ‌రావ‌తితో సంబంధం లేక‌పోయినా బీజేపీని ముద్దాయిని చేయాల‌ని కొన్ని పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here