హైద‌రాబాద్ టూ రాయ‌ల‌సీమ‌..ఫేస్‌బుక్ ల‌వ్‌..?

ఫేస్‌బుక్ ప్రేమ‌లు ఈ మ‌ధ్య ఎక్కువ‌వుతున్నాయి. ఏపీ అబ్బాయి, తెలంగాణ అమ్మాయి ఫేస్‌బుక్ ప్రేమాయ‌ణం న‌డిపారు. తీరా పెళ్లి చేసుకున్న 15 రోజుల‌కే మొఖం చాటేశారు.

వివ‌రాల్లోకి వెళితే హైద‌రాబాద్‌కు చెందిన యువ‌తికి క‌ర్నూలు జిల్లాకు చెందిన యువ‌కుడితో ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ ప్రేమించుకున్నారు. ఈ ఏడాది జులై 4వ తేదీన హైద‌రాబాద్‌లో ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకున్నారు. అనంత‌రం హైద‌రాబాద్‌లోనే కాపురం పెట్టారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నా. 15 రోజులు కాపురం చెయ్య‌గానే త‌న సొంతూరుకు వెళ్లొస్తాన‌ని చెప్పి అబ్బాయి రాకేష్ క‌ర్నూలు జిల్లా నంద‌వ‌రం వ‌చ్చాడు. వ‌చ్చిన త‌ర్వాత ఫోన్ చెయ్య‌క‌పోవ‌డంతో ఆయ‌న భార్య ఆందోళ‌న‌కు గురైంది. దీంతో చేసేదేమీ లేక రాకేష్ ఊరికి వ‌చ్చి ఆరాతీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. కులాంత‌ర వివాహం చేసుకోవ‌డం రాకేష్ త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేద‌ని తెలిసింది. అందుకే రాకేష్ హైద‌రాబాద్ రాకుండా ఇక్క‌డే ఉన్నారు.

రాకేష్ భార్య చేసేదేమీ లేక మ‌హిళా సంఘం నాయ‌కుల‌ను క‌లిసి అత‌ని ఇంటి వ‌ద్ద బైఠాయించింది. రంగంలోకి దిగిన పోలీసులు న్యాయం చేస్తామ‌ని చెప్పారు. అయితే ఆమె హైద‌రాబాద్‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని తెలిపింది. వెనుకా ముందూ చూసుకోకుండా ఫేస్ బుక్‌లో ప్రేమించుకుంటే ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here