ప్ర‌ధాని మోడీ, సీఎం జ‌గ‌న్..ఇద్ద‌రూ ఇద్ద‌రే..?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల ప‌ట్ల ప్ర‌జ‌లు త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. అత్యంత ప్ర‌జాదర‌ణ క‌లిగిన వ్య‌క్తిగా మోడీ,  అత్యుత్త‌మ సీఎంల‌లో జ‌గ‌న్‌ను నిల‌బెట్టారు.

ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే కార్వీ ఇన్‌సైట్స్  మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరిట ఓ స‌ర్వే చేపట్టింది. ఇందులో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిగా, ఆయ‌నే మ‌ళ్లీ ప్ర‌ధాన మంత్రిగా ఉండాల‌ని 66 శాతం మంది ప్ర‌జ‌లు కోరుకున్నారు. ఈ స‌ర్వేలే రాహుల్ గాంధీకి 8 శాతం మంది మొగ్గుచూపారు. ఈ సంవ‌త్స‌రం జులై 15 నుంచి 27వ తేదీ మ‌ధ్య‌లో 12,021 మందితో టెలిఫోన్ ఇంట‌ర్వూ ద్వారా అభిప్రాయాలు సేక‌రించారు.

ఇక దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రుల్లో ఏపీ సీఎం వై.ఎస్ జ‌గ‌న్‌కు మూడో స్థానం ద‌క్కింది. ఇదే కాకుండా క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో ఆంధ్రప్ర‌దేశ్ బాగా ప‌నిచేస్తోంద‌ని ఇండియాలో బ్రిట‌న్ తాత్కాలిక హైక‌మీష‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న జాన్ థాంప్స‌న్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హై క‌మీష‌న‌ర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌లు కూడా కితాబిచ్చిన విష‌యం తెలిసిందే.

ఇక అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రుల్లో మొద‌టి స్థానంలో యోగి ఆదిత్యానాథ్‌, రెండ‌వ స్థానంలో అర‌వింద్ కేజ్రీవాల్ నిలిచారు. 19 రాష్ట్రాల‌లోని 97 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ స‌ర్వే జ‌రిగింది.

జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here