అమ‌రావ‌తి ఎంపీకి క‌రోనా పాజిటివ్‌

రాజ‌కీయ నాయ‌కులు, సెలబ్రెటీలు అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా సినీన‌టి, ఎంపీ న‌వ‌నీత్ కౌర్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఫేస్ బుక్ ద్వారా వెల్ల‌డించారు. త‌న కుమారుడు, కుమార్తెతో పాటు కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకింద‌న్నారు. అయితే వీరిని జాగ్ర‌త్త‌గా చూసుకునే నేప‌థ్యంలో తాను కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్లు చెప్పారు.

ఈ మ‌ధ్య కాలంలో త‌న‌ను క‌లిసిన వారు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని న‌వ‌నీత్ సూచించారు.
అయితే తామంతా క‌రోనాను జ‌యిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వం సూచించిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ఇంట్లోనే జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

అయోధ్యలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌పై ఓవైసీ కామెంట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here