స‌మంత‌, ర‌ష్మిక అక్కాచెల్లెళ్ల‌ట‌.

హీరోయిన్లు స‌మంత‌, ర‌ష్మిక మంద‌న అక్కాచెల్లెళ్లు‌. అయితే వీరు ఏదో దూర‌పు బంధువులు కాదు. తాజాగా ఓసినిమాలో వీరు అక్కాచెల్లెళ్లుగా న‌టిస్తున్నార‌ట‌.

తెలుగుతో పాటు క‌న్న‌డ‌, తమిళ బాష‌ల్లో సినిమాలు తీస్తూ రాణిస్తున్నారు హీరోయిన్ స‌మంత‌. ర‌ష్మిక మంద‌న కూడా అంతే తెలుగుతో పాటు క‌న్న‌డ, త‌మిళ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే వీరిద్ద‌రు క‌లిసి ఇప్పుడు ఓ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స‌మంత‌, ర‌ష్మిక అక్కాచెల్లెళ్లుగా అంట‌.

ఈ చిత్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో స‌మాచారం తెలియిక‌పోయినా ఓ యువ ద‌ర్శ‌కుడు ఈ మేర‌కు క‌థ‌ను రెడీ చేసుకొని వీరికి ఫోన్‌లోనే వినిపించార‌ని స‌మాచారం. స్టోరీ బాగుండ‌టంతో ఇద్ద‌రు హీరోయిన్లు ఓకే శార‌ని టాక్ న‌డుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రానున్న ఈ మూవీ గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here