విశాఖ‌ రాజ‌ధానిగా ఉంటే ఎందుకు అభ్యంత‌రం..?

మూడు రాజ‌ధానుల‌పై వ్య‌తిరేకంగా పోరాడుతున్న టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు పై నేత‌లు మండిప‌డుతున్నారు. విశాఖ‌ప‌ట్నం రాజ‌ధానిగా ఉంటే చంద్ర‌బాబుకు ఎందుకు అభ్యంత‌ర‌మ‌ని చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మశ్రీ అన్నారు. విశాఖ‌ను రాజ‌ధానిగా చంద్ర‌బాబు వ్య‌తిరేకిస్తే ఉద్య‌మాలు త‌ప్ప‌వ‌న్నారు.

నూత‌న రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వ‌చ్చే విశాఖ‌లో రాజ‌ధాని ఏర్పాటుచేస్తే త‌క్కువ ఖర్చుతో రాజ‌ధాని పూర్త‌వుతుంద‌న్నారు. ప‌ది వేల కోట్ల రూపాయ‌ల‌తో విశాఖ‌, అమ‌రావ‌తి, క‌ర్నూల్లో రాజ‌ధానుల నిర్మాణం పూర్త‌వుతుంద‌న్నారు. చంద్ర‌బాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని ఉంటుంద‌న్నారు.

ఇక జూమ్ టీవీల్లో మాట్లాడ‌టం ఏంట‌ని.. ఇలా మాట్లాడితే ప్ర‌జ‌లు వినే పరిస్థితుల్లో లేర‌న్నారు. చంద్ర‌బాబు మాట‌లు వింటే టిడిపి నేత‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్తు స‌మాధ‌వుతుంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here