ప్ర‌పంచంలో ముఖేశ్ అంబానీ ర్యాంక్ ఎంతో తెలుసా..

ముఖేశ్ అంబానీ.. ఇండియాలో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ఎందుకంటే వ్యాపార దిగ్గ‌జంలో దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉంటూ నిత్యం వార్త‌ల్లోకెక్కుతుంటాయ‌న‌. మ‌ళ్లీ నేడు మ‌రో స్థానం అధిగ‌మించి కుబేరుల జాబితాలో ముందు వ‌రుస‌లో నిలిచారు.

ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ  మంచి చోటు సంపాదించుకున్నారు. ఐద‌వ స్థానంలో నిలిచాడు ముఖేశ్‌. ఇంత‌వ‌ర‌కు ఏ భార‌తీయుడు ఈ స్థానానికి చేరుకోలేదు. కాగా వ్యాపార దిగ్గ‌జంగా పిల‌వ‌బ‌డే ముఖేశ్‌ ఈ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. రిల‌య‌న్స్ టెలికాం జియోలో వ‌రుస పెట్టుబ‌డుల‌తో ఈయ‌న అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో చేరిపోయారు.

ముఖేశ్ సంప‌ద 75 బిలియ‌న్ డాల‌ర్లుగా ఫోర్బ్స్ లెక్కేసింది. అంటే రూ. 5.61 ల‌క్ష‌ల కోట్ల‌న‌మాట‌. కాగా టాప్ 10 బిలియ‌నీర్స్‌లో ఆసియా నుంచి ఉన్న ఒకే ఒక వ్య‌క్తి కూడా ముఖేశ్ అంబానీయే. కాగా మొద‌టి స్థానంలో అమేజాన్ అధిప‌తి జెఫ్ బెజోస్‌ 185.8 బిలియ‌న్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ 113.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో రెండ‌వ స్థానంలో కొన‌సాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here