రామ్‌గోపాల్ వ‌ర్మ కౌంట‌ర్‌.. నువ్వెవ‌రో తెలియ‌దు

ఇండ‌స్ట్రీలో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ల పేర్లు చెబితే అందులో క‌చ్చితంగా రామ్ గోపాల్ వ‌ర్మ పేరు చెబుతారు. అదే స‌మ‌యంలో వివాదాల‌కు కేంద్ర బిందువు కూడా ఆయ‌నే అంటారు. ఎప్పుడూ ఏదో ఒక అంశంలో త‌న‌దైన శైలిలో స్పందించే వ‌ర్మ తాజాగా మళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చారు.

రామ్‌గోపాల్ వ‌ర్మ అంటేనే వివాదం అనే స్థాయిలో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఏర్ప‌డింద‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే ఏ విష‌యం గురించి మాట్లాడినా ఆయ‌న స్టైల్‌లో మాట్లాడి దీని ద్వారా విమ‌ర్శ‌ల పాల‌వ్వ‌డం వ‌ర్మ‌కే సొంత‌మైంద‌ని చెప్పాలి. మొన్నీమ‌ధ్య అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లంటూ వివాదాస్ప‌ద మూవీని తీశారు వ‌ర్మ‌.

ఇప్పుడు అదే దారిలో ప‌య‌నిస్తూ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను బేస్ చేసుకొని ప‌వ‌ర్‌స్టార్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ అంటూ మొద‌లెట్టాడు. సినిమా ట్రైల‌ర్‌ను కూడా వ‌ర్మ విడుద‌ల చేశాడు. అయితే ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ అభిమానులు రాంగోపాల్ వ‌ర్మ‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. మూవీ ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌ను డిస్‌లైక్ కొడుతున్నారు.

ఇక హీరో నిఖ‌ల్ విష‌యానికొస్తే వ‌ర్మ‌ను ఉద్దేశించి ఈ మ‌ధ్య ప‌లు కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన వ‌ర్మ నిఖిల్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఆయ‌న హీరో అయ్యిండొచ్చేమో కానీ త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. వీరంతా ప‌వ‌న్ క‌ల్యాణ్ కింద తొత్తుల‌న్నారు. మొత్తం మీద వ‌ర్మ ఎప్పుడూ ఏదోర‌కంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటార‌ని ఆయ‌న అభిమానులు చెప్పుకొస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here