సానియా మీర్జాపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే..

బీజేపీ ఏమ్మెల్యే రాజా సింగ్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. వికారాబాద్ అడ‌వుల్లో ఇటీవ‌ల కాల్పులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆవును చంపేసిన‌ట్లు వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌.. సానియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వికారాబాద్‌ జిల్లా దామగుండలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఉంద‌ని రాజాసింగ్ ఆరోపించారు. గ్రామ‌స్థుల స‌మాచారం మేర‌కు ఫామ్‌హౌస్‌లో సానియా మీర్జానే కాల్పులు జరిపిందని ఆయ‌న చెప్పారు. సానియా గతంలో కూడా నెమలిని చంపినట్లు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. గోమాతపై కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

వికారాబాద్ అడ‌వుల్లో ఇటీవ‌ల జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో సానియా మీర్జా ఫామ్‌హౌస్ ఇంచార్జి ఉమర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో మేత‌కు వచ్చిన ఆవును కాల్చి చంపిన‌ట్లు ఉమ‌ర్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. నిందితుడికి తుపాకీ ఎలా వ‌చ్చింద‌నే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కేసు విచారణ జరుగుతుండగానే రాజాసింగ్ సానియా మీర్జాపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మ‌రి ఈ విష‌యంలో పోలీసులు పూర్తి వివ‌రాలు చెబితే కానీ ఏం జ‌రిగిందన్న దానిపై నిజానిజాలు బ‌య‌ట‌కు రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here