ప్లాన్‌ చేసి సినిమాలెప్పుడూ చేయలేదు..!

‘సూపర్‌’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార అనుష్క. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ జేజమ్మ. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతోంది స్వీటీ.

ఇదిలా ఉంటే తాజాగా తన సినీ కెరీర్‌ సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు చెప్పుకొచ్చింది అనుష్క. ఈ విషయమై ఈ బొమ్మాలీ మాట్లాడుతూ.. ‘పదిహేనేళ్ల నా సినీ ప్రయాణంలో నేనెప్పుడూ ప్లాన్‌ చేస్తూ సినిమాలు చేయలేదు. మనసు చెప్పిన మాటలకు కట్టుబడుతూ ముందుకుసాగాను అంతే. వ్యాపార కోణంలో ఆలోచించి ఇప్పటివరకు సినిమాల్ని అంగీకరించలేదు. ఆ లెక్కలు నాకు తెలియవు. నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుంది? పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుందా?లేదా? అనేవి పట్టించుకోను. నా మనసుకు నచ్చితే చాలనుకుంటాను. అంతకుమించి ఏదీ కోరుకోను. ఎలాంటి ప్రణాళికలు వేసుకోకుండా సినిమాల్లో నటిస్తుంటా. ఆ ఆలోచనా విధానమే  నాకు విజయాల్ని తెచ్చిపెట్టింది. డబ్బు, స్టార్‌డమ్‌ ఇవ్వలేని సంతృప్తి, ఆనందాన్ని  ఈ విజయాలతో పొందగలిగాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here