ఆఆఆఈఈఊఊఊ..ఇది కూత కాదు

పిల్ల‌లు పుట్ట‌గానే మ‌నం ఆలోచించేది పేర్ల గురించే.. సాదార‌ణంగా ఇది ఎవ‌రైనా చేసే ప‌నే. ఆడ‌పిల్ల పుట్టినా మ‌గ పిల్లాడు పుట్టినా వెంట‌నే ఓ పెద్ద ఫంక్ష‌న్ చేస్తారు. వారికి పేరు పెడ‌తారు.

పిల్ల‌ల‌కు పేర్లు పెట్ట‌డంలో త‌ల్లిదండ్రుల పాత్ర చాలా కీల‌కం. ఎందుకంటే ఆ ఊరిలో కానీ, వీధిలో కానీ, లేక తెలియిన వాళ్ల‌లో ఎవ‌రికైనా ఉన్న పేర్లు పెట్ట‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఓ ఊరిలో మాత్రం పిల్ల‌ల‌కు పేరే పెట్ట‌రు. మేఘాల‌య రాష్ట్రంలోని కాంగ్‌థోంగ్ గ్రామంలో ఇదే జ‌రుగుతుంది. వారి పిల్ల‌ల‌కు పేర్లు పెట్ట‌డం అక్క‌డ అల‌వాటు లేదు.

అయితే పేరుకు బ‌దులు పాట‌లు పాడి పిల్ల‌ల‌ను పిలుస్తారు. పుట్టిన వెంట‌నే త‌ల్లి త‌న బిడ్డ‌కు ఏం పాట పాడాలో నిర్ణ‌యించి పాడ‌తారు. ఇక అంద‌రూ ఆ పాట పాడి అదే పిలుస్తూ ఉంటారు. కొంద‌రు పెద్ద పెద్ద పాట‌ల‌తో పిలుస్తుంటారు. మ‌రి కొంద‌రు చిన్న చిన్న‌గా పాట‌లు పాడుతారు. అయితే ఈ విచిత్ర‌మైన సాంప్ర‌దాయం ఎందుకంటే మాత్రం వారు స‌మాధానం తెలియ‌దంటారు. ఏదిఏమైనా విభిన్న సాంప్ర‌దాయాల‌కు నెల‌వైన మ‌న‌దేశంలో ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయ‌ని చాలా మందికి తెలియ‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here