అభిమానుల‌కు షాకిచ్చిన మ‌హేష్ బాబు..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానుల‌కు షాక్ ఇచ్చారు. మహేష్ బ‌ర్త్ డే వేడుకల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఫ్యాన్స్‌కు ఆయ‌న బ్రేకులు వేశారు. అంద‌రూ ఇంట్లోనే జాగ్ర‌త్తగా ఉండాల‌న్నారు.

ఈ నెల 9వ తేదీన మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే అన్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌తి ఏడాది ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్బంగా అభిమానులు సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డం, సంబ‌రాలు చేసుకోవడం జ‌రుగుతూ ఉంటుంది. అయితే ఈ సారి కూడా మ‌హేష్ ఫ్యాన్స్ సంబ‌రాలు సిద్ధ‌మ‌య్యారు. కానీ ప్రిన్స్ ఇలా చెయ్యొద్ద‌ని చెబుతున్నారు.

అభిమానుల కోసం ప్ర‌త్యేకంగా మ‌హేష్ ఒక లేఖ మాదిరి రాశారు. ఆయ‌న ఏమ‌న్నారంటే.. వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. అంద‌రూ ఇంట్లోనే ఉండాల‌ని.. బ‌ర్త్‌డే వేడుక‌లు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని చెప్పారు. సామూహిక వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని కోరుకుంటున్నా అని మ‌హేష్ బాబు అన్నారు. ఇక ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్బంగా కొత్త సినిమా స‌ర్కారు వారి పాట ట్యూన్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

మెగాస్టార్‌, సూప‌ర్ స్టార్ ఏం చేస్తారో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here