చిరంజీవి అందుకే అలా మాట్లాడారా..?

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి జ‌న‌సేన పార్టీ గురించి మాట్లాడ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. బీజేపీ అధ్య‌క్షుడితో జ‌రిగిన చిరు భేటీలో ఏమై ఉంటుందో అని ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న ఇటీవ‌ల హైద‌రాబాద్ వెళ్లి చిరంజీవితో భేటి అయ్యారు. మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఈ భేటి జ‌రిగింది. ఏపీ అభివృద్ధిలో బీజేపీ జ‌న‌సేన భాగ‌స్వామ్యం కావాల‌ని చిరంజీవి ఈ సంద‌ర్బంగా సోము వీర్రాజుకు చెప్పారు. 2024లో బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డిగా అధికారం చేప‌ట్టాల‌న్నారు.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు చిరంజీవితో భేటి అయ్యారంటేనే అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఒక పార్టీ అధ్య‌క్షుడు చిరంజీవితో ఎందుకు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. స్టేట్ పాలిటిక్స్‌లో ప్ర‌స్తుతం చిరంజీవి అంత చురుకుగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ భేటి మాత్రం భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌కు ఏమైనా సంకేతమా అన్న చ‌ర్చ ఏపీ పాలిటిక్స‌లో న‌డుస్తోంది.

జ‌న‌సేన‌, బీజేపీ రెండు పార్టీలు క‌లిసి ముందుకు వెళ‌తాయ‌ని ఇప్ప‌టికే తెలిసిందే. అయితే చిరంజీవి ఇప్పుడు ఎంట‌ర‌వ్వ‌డం ట్విస్ట్‌.. పైగా జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని చిరంజీవి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడికి చెప్ప‌డం ప‌వన్ బీజేపీలో చేర‌బోతున్నారా అన్న సంకేతాల‌కు బ‌లం చేకూరుస్తోంది. 2024 ఎన్నిక‌లో ల‌క్ష్యంగా ఏపీలో పాగా వేయాల‌ని చూస్తోన్న బీజేపీకి చిరంజీవి తోడు కావాల‌ని కోరుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ, జ‌న‌సేన‌, చిరంజీవి ఇలా అంతా క‌లిసి ప‌నిచేసే విధంగా ప్లాన్ చేసిన‌ట్లు కొంద‌రు మాట్లాడుకుంటున్నారు. మ‌రి ఏమవుతుందో వేచి చూడాలి.

మెగాస్టార్‌, సూప‌ర్ స్టార్ ఏం చేస్తారో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here