రాక్షసుడు మళ్ళీ వస్తున్నాడు..!!

తెలుగులో మంచి హిట్ సాధించిన రాక్ష‌సుడు మూవీకి సీక్వెల్ రానుంది. ఈ మేర‌కు చిత్ర‌బృందం రాక్ష‌సుడు 2 తీసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందింది.

త‌మిళ్‌లో రాచ్చ‌స‌న్ చిత్రాన్ని తెలుగులో రాక్ష‌సుడిగా తీశారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్‌లు జంట‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. సైకో థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా తెలుగులో బాగా ఆడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ చెయ్యాల‌ని చూస్తున్నారు.

త‌మిళ్‌నుంచి వ‌చ్చిన ఈ సినిమాకు అక్క‌డ సీక్వెల్ చెయ్య‌క‌పోయినా తెలుగులోనే సీక్వెల్ చెయ్యాల‌ని చిత్ర ద‌ర్శ‌కుడు  ర‌మేష్ వ‌ర్మ ఈ మేర‌కు క‌థ‌ను కూడా సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్కబ‌డితే వెంట‌నే సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ  సినిమాలో ఎవ‌రు న‌టించారో ఇప్పుడు తీయ‌బోయే సీక్వెల్ లో కూడా వారే న‌టించేలా నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే రాక్ష‌సుడు 2 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here