చంద్ర‌బాబు కుట్ర‌ల‌న్నీ తెలుసు.. మంత్రి పేర్ని నాని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై మంత్రి పేర్ని నాని మండిప‌డ్డారు. ఆయ‌న కుట్ర‌ల‌న్నీ మాకు తెలుస‌న్నారు.

ట్విట్ట‌ర్ వేదికగా పేర్ని నాని పేర్కొన్నారు. చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌లు తాము అధికారంలోకి రాక‌ముందే ఊహించిన‌ట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. చంద్ర‌బాబు ఏ విధంగా వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేయ‌గ‌ల‌రో తెలుస‌న్నారు. వాట‌న్నింటిని అధిగ‌మించి ముందుకు వెళ‌తామ‌న్నారు. వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌న్నారు మంత్రి.

ఇక మూడు రాజ‌ధానుల అంశం కోర్టు ప‌రిధిలో ఉన్న విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉండాల‌ని చెబుతుండ‌గా.. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజ‌ధానులు పెట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాల‌ని ముందుకు వెళుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here