డిసెంబ‌ర్‌లో మళ్లీ లాక్‌డౌన్‌..?

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దేశంలో కూడా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో క‌రోనా రెండవ సారి విజృంభిస్తోంద‌న్న వార్త‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ లాక్ డౌన్ పెడ‌తారా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌ డౌన్‌ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ట్విటర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా వార్తలు ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఖండిస్తూ భారత సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రభుత్వానికి చెందిన నిజ నిర్ధారణ విభాగం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) దీనిపై స్పందించింది. ప్రముఖ మీడియా సంస్థ పేరుతో మార్ఫింగ్‌ చేసిన ఒక ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోందని, అయితే లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన ఇప్పటి వరకు ప్రభుత్వానికి లేదని పీఐబీ వెల్లడించింది.

కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కొంద‌రు కావాల‌నే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌న్న‌ట్లు ఇలా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. దీనిపై ప్ర‌జ‌లు అవ‌గ‌హ‌ణ‌తో ఉండాల్సిర అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఇప్ప‌టి వ‌ర‌కైతే ప్ర‌జ‌లంతా మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ ఉండాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here